బీడీ కార్మికులకు ఐడీ కార్డులు: దత్తాత్రేయ | id cards for labour, says bandaru dattatreya | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు ఐడీ కార్డులు: దత్తాత్రేయ

Jan 30 2015 5:45 PM | Updated on Sep 2 2017 8:32 PM

బీడీ కార్మికులకు ఐడీ కార్డులు: దత్తాత్రేయ

బీడీ కార్మికులకు ఐడీ కార్డులు: దత్తాత్రేయ

తెలంగాణలో బీడీ కార్మికులకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం తెలిపారు.

తెలంగాణలో బీడీ కార్మికులకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... అసంఘటిత కార్మికుల కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశామని ఆయన చెప్పారు. త్వరలోనే వారికి స్మార్ట్ కార్డులు... పారదర్శకంగా జవాబుదారీతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంపొందిస్తుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈఎస్ఐసీ కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నివేదికలు అందించాలని అధికారులకు సూచించామని దత్తాత్రేయ అన్నారు. కార్మిక రంగంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి దత్తాత్రేయ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement