ఏసీపీ మల్లారెడ్డిపై వేటు

Ibrahimatnam has been exposed to former ACP  Malla Reddy - Sakshi

డీజీపీ కార్యాలయంలోరిపోర్ట్‌ చేయాలని ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా 26 మందిడీఎస్పీల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రవాస భారతీయుడు చిగురుపా టి జయరామ్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ ఎస్‌.మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయన్ను గతంలోనే రాచకొండ హెడ్‌క్వార్టర్స్‌కు ఎటాచ్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం మొత్తం 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇబ్రహీంపట్నం ఏసీపీగా వి.యాదగిరిరెడ్డిని నియమించింది. రాచకొం డలో ఉన్న మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కనబెట్టింది. మరోపక్క ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకేచోట నిర్ణీత కాలం పని చేసిన అధికారులకూ స్థాన చలనం కల్పించారు. 

బదిలీ అయిన వారి వివరాలు..
ఠి ఏసీబీలో ఉన్న కిరణ్‌కుమార్‌ను తూప్రాన్‌కు, కరీంనగర్‌ ట్రాఫిక్‌లో ఉన్న శ్యాంసుందర్‌ను మామూనూరుకు బదిలీ చేశారు. ఠి సైబరాబాద్‌ సీటీసీలో ఉన్న ఉమేందర్‌ను గోదావరిఖనికి, రామగుం డం టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న రమణారెడ్డిని చౌటుప్పల్‌కు, అక్కడున్న బాపురెడ్డిని బాలానగర్‌ ట్రాఫిక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఠి కరీంనగర్‌ పీటీసీలో ఉన్న సత్యన్నను కామారెడ్డి రూరల్‌కు, అక్కడి చంద్రశేఖర్‌గౌడ్‌ను హైదరాబాద్‌ నగర భద్రత విభాగానికి బదిలీ చేశారు. ఠి బాలానగర్‌ ట్రాఫిక్‌లో పనిచేస్తున్న నరసింహారావును పేట్‌ బషీరాబాద్‌కు, ఇక్కడున్న అందె శ్రీనివాసరావును మల్కాజిగిరి ట్రాఫిక్‌ కు, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ దేవేందర్‌ను మీర్‌చౌక్‌కు, అక్కడున్న ఏసీపీ ఆనంద్‌ను సీఎస్‌డబ్ల్యూకు, సీఐడీ డీఎస్పీ సత్తయ్యను సత్తుపల్లికి బదిలీ చేశారు.

ఠి సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులును సీఐడీకి, సైబరాబాద్‌ ఎస్బీ ఏసీపీ భుజంగరావును రాచకొండకు, రాచకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డిని సీఐడీకి, ఎస్బీ ఏసీపీగా ఉన్న భుజంగరావును భువనగిరికి, అక్కడున్న జితేందర్‌రెడ్డిని సీఐడీకి, సీఐడీలో ఉన్న గణపతి జాదవ్‌ను జహీరాబాద్‌కు, అక్కడున్న ఎన్‌.రవిని కరీంనగర్‌కు పీటీసీకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఠి మహదేవపూర్‌ ఎస్డీపీవో ఆర్‌.కె.కె.ప్రసాద్‌ను కరీంనగర్‌ ట్రాఫిక్‌కు, రాచకొండ క్రైమ్స్‌ ఏసీపీ శ్రీధర్‌ను హన్మకొండకు, సీఐడీలో ఉన్న రమేశ్‌ను ఊట్నూరుకు, అక్కడున్న వెంకటేశ్‌ను రాచకొండ క్రైమ్‌కు, హన్మకొండ ఏసీపీ చంద్రయ్యను సైబరాబాద్‌ సీటీసీ ఏసీపీగా బదిలీ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top