నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల | I CET notification released today | Sakshi
Sakshi News home page

నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల

Feb 25 2015 1:43 AM | Updated on Sep 2 2017 9:51 PM

ఐసెట్ - 2015 షెడ్యూల్ బుధవారం విడుదల చేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ కడారు వీరారెడ్డి తెలిపారు.

కరీంనగర్: ఐసెట్ - 2015 షెడ్యూల్ బుధవారం విడుదల చేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ కడారు వీరారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కేయూకు అప్పగించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ వీసీ వీరారెడ్డి కేయూ ఇన్‌చార్జి వీసీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన బుధవారం శాతవాహన యూనివర్సిటీ పరిపాలన విభాగంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డిలు హాజరు కానున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement