ఒక్కటైన ఖండాతర ప్రేమ | Hyderabad Man Marriage With American Woman in LB nagar | Sakshi
Sakshi News home page

ఒక్కటైన ఖండాతర ప్రేమ

Feb 1 2020 8:22 AM | Updated on Feb 1 2020 8:22 AM

Hyderabad Man Marriage With American Woman in LB nagar - Sakshi

వరుడు శ్యాంసుందర్, వధువు డీన్నాతో కుటుంబ సభ్యులు

ఎల్‌బీనగర్‌: ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన నగరానికి చెందిన యువకుడు అక్కడి అమ్మాయిని ప్రేమించాడు. ఇండియాకు వచ్చి కుటుంబ సభ్యుల సమ్మతితో ఆమెరికా అమ్మాయితో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం వివాహం చేసుకున్నాడు. వివరాలివీ... రాంనగర్‌కు చెందిన తాడూరి చంద్రశేఖర్‌ కుమారుడు శ్యాంసుందర్‌ కొన్నాళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ డీన్నా అనే అ మ్మాయితో పరిచయం అయి అదికాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించిన వారు ఇండియాకి వచ్చారు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని బొబ్బిలి దామోదర్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం పెద్దలు ఇద్దరికీ వివాహం జరిపించారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వివాహం చేసుకోవటం తనకెంతో ఆనందంగా ఉందని అమెరికా అమ్మాయి డీన్నా తెలిపింది. తల్లిదండ్రులు, అత్తమామల దీవెనలను తీసుకుంది. వధూవరులకు ఇరు కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement