భార్యను కడతేర్చిన భర్త అరెస్ట్ | Husband arrested wife killed | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చిన భర్త అరెస్ట్

Jul 2 2016 3:17 AM | Updated on Sep 4 2017 3:54 AM

భార్యను కడతేర్చిన భర్తను అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ 1వ పట్టణ సీఐ భిక్షపతి తెలిపారు.

 మిర్యాలగూడ రూరల్ :  భార్యను కడతేర్చిన భర్తను అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ 1వ పట్టణ సీఐ భిక్షపతి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్‌కు చెందిన నర్మద, ఇదే పట్టణం కలాల్‌వాడకు చెం దిన కొంక రాములు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
 
  ఇద్దరు సంతానం కలిగిన తరువాత కుటుంబ తగాదాల నేపథ్యంలో నర్మద తన పిల్లలతో భర్తకు దూరంగా ఉంటూ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుంది. ఈ నెల 27న పాఠశాలకు వె ళ్లి సాయంత్రం ఇంటికి నడచుకుంటు వెళుతున్న నర్మదను నందిపహాడ్ బైపాస్ రోడ్డు వద్ద కాపు కాసి భర్త రాము సుత్తెతో ఆమె తలపై మోది హత్య చేసి పారిపోయాడు.
 
 కాగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణ శివారులో రైల్యే బ్రిడ్జి సమీపంలో సంచరిస్తున్న రాములను  అరెస్ట్ చేసినట్లు తె లిపారు. నిందితుడి విచారణ చేయగా భార్య తనపై కేసులు పెట్టిందనే అక్కసుతోనే హతమార్చినట్టు నిందితుడు పేర్కొన్నాడని తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై వి.సర్దార్‌నాయక్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై బుచ్చయ్య, పోలీసులు సురేష్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, రాంమూర్తి, శ్రీను, గోపి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement