భారీగా రంగురాళ్ల పట్టివేత | huge colour stones Captured in khammam district | Sakshi
Sakshi News home page

భారీగా రంగురాళ్ల పట్టివేత

May 8 2016 9:12 AM | Updated on Sep 3 2017 11:41 PM

ఖమ్మం జిల్లాలో భారీగా రంగురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 18 బస్తాల రంగురాళ్లను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైరా: ఖమ్మం జిల్లాలో భారీగా రంగురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 18 బస్తాల రంగురాళ్లను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైరాలోని నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కు కొణిజర్లకు చెందిన ఓ వ్యక్తి 18 బస్తాల రంగురాళ్లను తీసుకొచ్చాడు. మళ్లీ వచ్చి బుక్ చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. ట్రాన్స్‌పోర్ట్ గోదాములో రంగురాళ్లు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గోదాములో తనిఖీలు చేపట్టి 18 బస్తాల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement