భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే | High Court stays arrest of bhuma .. | Sakshi
Sakshi News home page

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

Dec 2 2014 1:38 AM | Updated on Sep 2 2017 5:28 PM

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్‌సీ, ఎస్‌టీ కేసులో ఆయ న అరెస్ట్‌పై 2 వారాలపాటు స్టే విధించింది.

సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్‌సీ, ఎస్‌టీ కేసులో ఆయ న అరెస్ట్‌పై 2 వారాలపాటు స్టే విధించింది. న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తనపై నంద్యాల పోలీసులు ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అకస్మాత్తుగా మరణించారని, ఆ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నాగిరెడ్డి అరెస్ట్‌పై రెండు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement