breaking news
Bhuma Nagy Reddy
-
నేడు భూమా మృత దేహానికి అంత్యక్రియలు
-
పయ్యావులకు ‘పవర్’ కట్ !
మంత్రి పదవిపై ఏడాదిగా ఎమ్మెల్సీ కేశవ్ ఆశలు పల్లె, పరిటాలలో ఒకరిని తప్పించి మంత్రి మండలిలో చేరే ఎత్తుగడ ఆయన ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు భూమాకు మంత్రి పదవికట్టబెట్టే యోచనతోనే అడ్డంకులు సాక్షిప్రతినిధి, అనంతపురం మంత్రి పదవిపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లారా? మంత్రివర్గ విస్తరణలో కేశవ్‌ను కాదని భూమా నాగిరెడ్డి లేదా అఖిల ప్రియకు పదవి కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు మంత్రి కాలేకపోతే జీవితకాలంలో మరెప్పుడూ కాలేరని పయ్యావుల అనుచరులు ఇటీవల బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలే నిజమవుతున్నాయా?... తెలుగుదేశం పార్టీలో తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. రాష్ట్రస్థాయి నేతగా ఎదిగే క్రమంలో జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఉరవకొండ నియోజకవర్గాన్ని, అక్కడి ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో ఓడిపోయారని ఆ పార్టీ అధిష్టానం కూడా భావించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని, పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో గెలవలేకపోయానని కేశవ్ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద వేదనపడినట్లు తెలిసింది. పల్లె ర ఘునాథరెడ్డి, పరిటాల సునీతకు జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కడంతో కేశవ్ గత 20 నెలలుగా జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మినహా మరే కార్యక్రమంలోనూ కన్పించలేదు. ఇదిలావుండగా.. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కేశవ్ వ్యూహరచన చేశారు. జిల్లా మంత్రులు పల్లె, పరిటాలలో ఎవరినో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించి, తాను వెళ్లాలని చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి వద్దనున్న విద్యుత్ శాఖను అనధికారికంగా కేశవ్ ఇన్నాళ్లూ పర్యవేక్షించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఉండే మంత్రివర్గ విస్తరణలో మంత్రి కాబోతున్నానని, పోర్టుపోలియో ‘పవర్’ అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఓ టీడీపీ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేశవ్ ఎత్తులు చిత్తయ్యాయని తెలుస్తోంది. కేశవ్‌పై చంద్రబాబుకు సన్నగిల్లిన నమ్మకం పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే సందర్భంలో మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. భూమా కూడా పార్టీలోకి చేరుతున్న సందర్భంలో విద్యుత్‌శాఖను డిమాండ్ చేయడం, దానికి సీఎం అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి కేశవ్ నేరుగా చంద్రబాబును కలిసి తన మంత్రి పదవిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘పార్టీ బలోపేతం కోసం కొన్ని త్యాగాలు తప్పవు. ఎమ్మెల్యేగా ఓడిపోయావు. ఎమ్మెల్సీ ఇచ్చాం. ఈ ‘సారి’కి అంతటితో తృప్తి పడు’ అని కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేశవ్ మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ‘అనంత’ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఆయ న అరెస్ట్‌పై 2 వారాలపాటు స్టే విధించింది. న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తనపై నంద్యాల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అకస్మాత్తుగా మరణించారని, ఆ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నాగిరెడ్డి అరెస్ట్‌పై రెండు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
పీఏసీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యులతో మూడు ఆర్థిక కమిటీలను నియమించారు. ప్రజా పద్దు ల సమితి (పీఏసీ) చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి నియమితులయ్యారు. అంచనాల కమిటీకి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి కాగిత వెంకట్రావు చైర్మన్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బులెటిన్ జారీ చేశారు. -
‘స్థానిక’ సమరంపై భూమా దృష్టి
నంద్యాల, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గ పరిధిలోని నంద్యాల మండలంలో 19, గోస్పాడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఎంపీటీసీలతోపాటు రెండు జె డ్పీటీసీ స్థానాలకు ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్సీపీ గోస్పాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా యాళ్లూరు మేజర్ పంచాయతీకి చెందిన పల్లెసువర్ణ, నంద్యాల జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్తపల్లె గ్రామానికి చెందిన లక్ష్మిదేవి బరిలో ఉన్నారు. ఆయా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భూమా నాగిరెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని నాయకులు, ప్రజలతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ వర్గీయులకు దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారని.. ఈ సారి కూడా అదే విధమైన తీర్పు రావడానికి శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ నెల 4వ తేదీ లోపు ప్రచారాన్ని ముగించాల్సి ఉండటంతో అన్ని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలు ముగిస్తే నాలుగేళ్ల పాటు ఇక అటు పట్టణంలో గాని, ఇటు పల్లెల్లో గాని ఎన్నికలు ఉండవని అందువల్ల ఇప్పుడు కష్టపడాలని భూమా కోరారు.