ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేయాల్సిందే: హైకోర్టు

High court orders Private Colleges Cannot Withhold Students Certificates For Payment Of Amount - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాసైన ఇంటర్‌ విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికేట్లు వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రయివేట్‌ కళాశాలలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా కొన్ని ప్రయివేట్‌ కాలేజీలు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడాన్ని సవాల్‌ చేస్తూ నికేశ్‌ అనే విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థి ఫీజులు చెల్లించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు దగ్గరుంచుకోవడాన్ని తప్పుబట్టింది. వెంటనే విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఒకవేళ ఫీజులు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top