రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం | high court bar association split into many parts | Sakshi
Sakshi News home page

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం

Nov 15 2014 1:05 AM | Updated on Jun 2 2018 3:18 PM

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం - Sakshi

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం

ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇకపై రెండుగా విడిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి

డిసెంబర్‌లో ఎన్నికలకు అవకాశం... ప్రస్తుత కార్యవర్గం రాజీనామా
 సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇకపై రెండుగా విడిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో ఇదే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన న్యాయవాదుల్లో అత్యధికులు సంఘాన్ని విభజించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ మేరకు తీర్మానం చేశారు.

ఇరు రాష్ట్రాలకూ న్యాయవాదుల సంఘాలు ఏర్పాటయ్యాక వాటికి డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంఘం ప్రస్తుత కార్యవర్గం రాజీనామా చేసింది. అధ్యక్షుడు గిరిధరరావు తమ రాజీనామాలను ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్స్‌కు సమర్పించారు. దీంతో న్యాయవాదుల సంఘం వ్యవహారాలను ఇకపై వీరిద్దరూ నిర్వహించాల్సి ఉంటుంది. అలా నిర్వహించలేనిపక్షంలో.. ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement