‘టీఆర్‌ఎస్‌ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు’ | Gutta Sukhender Reddy Comments on TPCC Leaders | Sakshi
Sakshi News home page

Sep 21 2018 8:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

Gutta Sukhender Reddy Comments on TPCC Leaders - Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఖండించారు.  శుక్రవారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించకుంటే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీపీసీసీ సీనియర్‌ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించినవారేనని తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని  విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. 

చదవండి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పాత్ర సూదిమొనంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement