పెళ్లింట విషాదం | Groom died in turkapally | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Jun 15 2014 2:08 AM | Updated on Sep 2 2017 8:48 AM

పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం

తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన అన్నంపట్ల నర్సయ్య, నర్సమ్మ దంపతుల పెద్దకూమారుడు అన్నంపట్ల కనకరాజు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

 తుర్కపల్లి : తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన అన్నంపట్ల నర్సయ్య, నర్సమ్మ దంపతుల పెద్దకూమారుడు అన్నంపట్ల కనకరాజు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద  సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి రంగారెడ్డి జిల్లా చెర్లపల్లికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. శనివారం  మధ్యాహ్నం 12-05 నిమిషాలకు వధువు ఇంట్లో పెళ్లి జర గాల్సి ఉంది. గురువారం కనకరాజును తన ఇంట్లో పెళ్లికొ డుకుగా అలకరించారు. శుక్రవారం సాయంత్రం వరకు అత ని ఇల్లు బంధువులతో సందడిగా ఉంది. ఆ తర్వాత కాసేప టికి  పెళ్లికొడుకుకు ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో  చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజపేటకు తీసు కువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు.
 
 అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11-30 నిమిషాలకు మృతి చెందాడు.  పెళ్లికని వచ్చిన బంధువులు పెళ్లి కొడుకు చావును చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.  పెళ్లిని కళ్లార చూద్దామనుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమైండని బోరున విలపిస్తుంటే గ్రామస్తులు కంటతడిపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement