జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి | Greatly Jyashankar Jayanthi In Mahabubnagar | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

Aug 7 2018 2:49 PM | Updated on Oct 8 2018 5:07 PM

Greatly Jyashankar Jayanthi  In Mahabubnagar - Sakshi

జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జేసీ ఎస్‌.వెంకట్రావు, కలెక్టరేట్‌ ఉద్యోగులు   

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ 84వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా జేసీ ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ జయశంకర్‌ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు ఐక్య ఉద్యమాలను నిర్మించడం, అన్నివర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో ఎంతో కృషి చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జయశంకర్‌ లేకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ ప్రేమ్‌రాజ్, డీవైఎస్వో సత్యవాణి, వివిధ విభాగాల సూరింటెండెంట్లు చంద్రశేఖర్, రాజేశ్, రమేశ్, కలెక్టరేట్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement