breaking news
jayashankar jayanthi
-
జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ 84వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జేసీ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ జయశంకర్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు ఐక్య ఉద్యమాలను నిర్మించడం, అన్నివర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో ఎంతో కృషి చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జయశంకర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రేమ్‌రాజ్, డీవైఎస్వో సత్యవాణి, వివిధ విభాగాల సూరింటెండెంట్లు చంద్రశేఖర్, రాజేశ్, రమేశ్, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జయశంకర్ తపించారు
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యమని పరితపించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ అన్నారు. స్థానిక న్యూటౌన్‌లో గల ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల గుప్పిట్లో నుంచి ఈ ప్రాంత నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను దక్కించుకోవడం కోసం ఆయన తపించిన తీరు మరువరానిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో అధిపత్యం కోసం రాజకీయ పార్టీల నాయకుల్లో విభేదాలు వచ్చినప్పుడు వారందరిని సమన్వయ పరచి ఆందోళనలను కొనసాగించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో ఆయన లేకపోవడం ఎవరూ పూడ్చలేని లోటని అన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ఆయన గడిపిన సాధారణ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జయశంకర్ ఆశయాలను నెరవేర్చిననప్పుడే ఆయన త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణకు సార్థకత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ మహ్మద్ వాజిద్, నాయకులు ఎల్.జస్వంత్‌రెడ్డి, కెటీ నర్సింహారెడ్డి, మహ్మద్ సర్దార్, అశోక్, విజయకుమార్ యాదవ్, నర్పింహారెడ్డి, రమేశ్, శ్రీనివాస్, యూనుస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.