
కనకమేడలను సన్మానిస్తున్న తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు.