రైతుల డిమాండ్లు నెరవేర్చాలి: కోమటిరెడ్డి ధర్నా | Govt should cosider Framers demands says komati reddy | Sakshi
Sakshi News home page

రైతుల డిమాండ్లు నెరవేర్చాలి: కోమటిరెడ్డి ధర్నా

Oct 28 2017 5:01 PM | Updated on Oct 1 2018 2:11 PM

Govt should cosider Framers demands says komati reddy - Sakshi

నల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. కాగా, రైతుల డిమాండ్లు నెరవేర్చాలంటూ వారికి మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని, లేకపోతే జిల్లావ్యాప్తంగా రహదారులు దిగ్బంధిస్తామని హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్‌ను రైతులు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రభుత్వం పట్టించుకోనందునే రైతులు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. అంతా బాగానే ఉందంటున్న హరీష్‌రావు నల్లగొండ రైతులకు ఏమి చెప్తారని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేసే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement