
సాక్షి, హైదరాబాద్: ఈద్–ఉల్–జుహ (బక్రీద్) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతంలో గొప్ప ప్రాశస్త్యం కలిగిన బక్రీద్‌ను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. త్యాగానికి ప్రతీక, దేవుడి పట్ల అపార భక్తిభావం, పేదల పట్ల కరుణకు బక్రీద్ సూచిక అన్నారు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న గొప్పదనాన్ని ఈ పండుగ తెలియజేస్తోందన్నా రు. దాతృత్వం, సుహృద్భావ స్ఫూర్తిని పండుగ సందర్భంగా అందరూ స్మరించుకోవాలని గవర్నర్ తన సందేశంలో కోరారు.