
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య
మహబూబ్‌నగర్ రూరల్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఎమ్మార్పీఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని అన్నారు. వర్గీకరణ సాధనలో భాగంగా ఈ నెల 7న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, తిరుమలయ్య, లక్ష్మయ్య, ప్రభుదాస్, హన్మంతు, గోపి, వెంకటయ్య, నగేష్, కర్రెప్ప, శ్రీనివాస్, శివరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.