సంస్థాన్ నారాయణపురం అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని....
మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి
రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
సంస్థాన్ నారాయణపురం అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డిలు అన్నారు. గుడిల్కాపురం నుంచి సంస్థాన్ నారాయణపురం వరకు రూ.6 కోట్లుతో 6 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ పనులకు బుధవారం గుడిమల్కాపురంలో మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా పుట్టపాక నుంచి బట్టోనిబావి, జనగాం, గంగమూల తండా వరకు రూ.2.97 కోట్లతో చేపట్టిన 6.4కిలోమీటర్ల రోడ్డు పనులకు పుట్టపాకలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాం కల్పించాడనికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ఆర్‌బీ ఎస్‌ఈ ఎం.లింగయ్య, ఈఈ బాలస్వామి, డీఈ సుదర్శన్ సర్పంచ్‌లు కొన్‌రెడ్డి సుగణమ్మ, నల్లగొండ కళమ్మ, ఏర్పుల అంజమ్మ, ఎంపీటీసీలు సామల వెంకటేశం, పానుగోతు సుజాత, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కాంతమ్మ, ఏఈ ఆస్తార్‌అన్సర్, మన్నే ఇంద్రసేనారెడ్డి, పాశం ఉపేందర్‌రెడ్డి, శ్రీరాముల నర్సింహ్మ, తెలంగాణ భిక్షం, దేపా విప్లవరెడ్డి, అలీంఅసద్, పరదేశి ఉన్నారు.