కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనాలు పెంపు | good news for contract lectures in telangana | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనాలు పెంపు

Jun 17 2017 11:00 AM | Updated on Sep 5 2017 1:52 PM

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనాలు పెంపు

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనాలు పెంపు

తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త. ఇన్నాళ్లు జీతాల పెంపుకోసం వారు చేసిన పోరాటాలకు ప్రతిఫలం లభించింది. వారి జీతాలు రూ.10వేల వరకూ పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనాలు రూ. 27 వేల నుంచి రూ. 37,100కు పెంచుతూ ప్రభుత్వం శనివారం  ఉత్తర్వులు జారీచేసింది.

దీంతో 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా రూ. 37 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. వేతనాల పెంపుపై శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల జీతాలను 2015 పీఆర్సీ స్కేల్‌కు అనుగుణంగా పెంచడం చాలాగొప్ప విషయం. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement