బంగారు నగలకు మెరుగు పేరుతో దుండగులు నగలతో ఉడాయించారు.
నగలకు మెరుగు పెడతామని..
Jan 13 2016 2:21 PM | Updated on Aug 17 2018 2:53 PM
లక్సెట్టిపేట్: బంగారు నగలకు మెరుగు పేరుతో దుండగులు నగలతో ఉడాయించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక గాంధీచౌక్ ఏరియాలో బంగారు నగలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించారు.
అదే ప్రాంతానికి చెందిన అంజలి, పద్మ అనే గృహిణులు తమ రెండు ఉంగరాలతో పాటు రెండు తులాల గొలుసును మెరుగు కోసం వారికి ఇచ్చారు. మెరుగు పెట్టే నెపంతో ఆగంతకులు వాటిని తమ దగ్గర ఉంచుకుని, నకిలీవి గృహిణులకు ఇచ్చి అక్కడి నుంచి మాయమయ్యారు. మోసపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Advertisement
Advertisement