అర్హులకు పింఛన్లు ఇవ్వాలె.. | given pensions for qualified people | Sakshi
Sakshi News home page

అర్హులకు పింఛన్లు ఇవ్వాలె..

Jan 19 2015 4:13 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని మండల ఎంపీడీఓ క్రాంతిని ఎల్వీ గ్రామస్తులు నిలదీశారు.

తానూర్: ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని మండల ఎంపీడీఓ క్రాంతిని ఎల్వీ గ్రామస్తులు నిలదీశారు. మండలాధికారి దిష్టిబొమ్మను కూడా రోడ్డుపై దహనం చేశారు. పింఛన్లు ఇచ్చేదాకా అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమకు పింఛన్లు రావటం లేదని మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు పింఛన్లు వచ్చే విధంగా చూడాలని కోరారు. అర్హులకు తప్పనిసరిగా పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement