పాత హామీలతో మభ్యపెడ్తున్నారు: బాలరాజు | Give Old Promises To People In Nizamabad | Sakshi
Sakshi News home page

పాత హామీలతో మభ్యపెడ్తున్నారు: బాలరాజు

Dec 5 2018 7:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

Give Old Promises To People In Nizamabad - Sakshi

సాక్షి, బాన్సువాడరూరల్‌:గత ఎన్నికల్లో ఇచ్చిన పాత హామీలనే మళ్లీ మళ్లీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని , అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాసుల బాలరాజు అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం, దేశాయిపేట్, సోమేశ్వర్, మొగులాన్‌పల్లి, తిర్మలాపూర్‌ తదితర గ్రామాలు, తండాల్లో పర్యటించి మాట్లాడారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీసీ కోటాలో తనకు కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇచ్చిందని తనను ఆదరించి గెలిపించాలన్నారు. ఈఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తనను గెలిపిస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాజాభజంత్రీల నడుమ స్వాగతం పలికారు.   ఈకార్యక్రమంలో టీడీపీ నియోజన వర్గ ఇంచార్జి కొడాలి రాము, నాయకులు ప్రతాప్‌సింగ్‌ రాథోడ్, అలీబిన్‌ అబ్దుల్లా, శంకర్‌గౌడ్, నర్సన్న చారీ, ఖాలేఖ్‌ తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీని తరిమి కొట్టాలి

 బీర్కూర్‌: పరిపాలన చేతకాక కాడి కింద పడేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి ఇంటికి పంపించాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాకూటమి బాన్సువాడ అభ్యర్ధి కాసుల బాలరాజ్‌కు మద్దతుగా బీర్కూర్‌ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో ప్రజాకూటమి అభ్యర్ధి కాసుల బాలరాజ్, కాంగ్రెస్‌ నాయకులు, మల్యాద్రిరెడ్డి మండల నాయకులు అబ్దుల్‌ హైమద్, పోగు నారాయణ, ఆరీఫ్, ఓంకార్, ఈరాస్‌ సాయిలు, దొంతురాం కాశీరాం పాల్గొన్నారు.

 కోటగిరి : కోటగిరి మండల కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల  బాల్‌రాజ్‌  తనయుడు కాసుల రోహిత్‌ ఎన్నికల ప్రచారం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement