వర్నిలో గంజాయి పట్టివేత | ganja caught in nizamabad district | Sakshi
Sakshi News home page

వర్నిలో గంజాయి పట్టివేత

Jun 20 2016 9:59 AM | Updated on Sep 4 2017 2:57 AM

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన స్మగ్లర్లు కారును గంజాయిని వదిలి పారిపోయారు. కారులో ఉంచిన 26 సంచుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement