నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను మార్చనున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసనసభలో తెలిపారు.
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శివారులోని కోహెడ సమీపంలోకి మార్చనున్నట్లు మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం శాసనసభలో తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు ప్రస్తుతం 22 ఎకరాల్లో ఉందని, స్థలం చాలక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మార్కెట్‌ను కోహెడకు తరలించి 178 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మార్కెట్ ఔటర్ రింగ్‌రోడ్ పక్కనే ఉండటం వల్ల రైతులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందన్నారు. మార్కెట్ యార్డు తరలింపు వల్ల నగరంలో కొన్ని ట్రాఫిక్ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందన్నారు.