అయ్యో గిట్లాయె..!

Funds Not Released To Mandal Parishads In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌  : పరిషత్‌ల్లో పైసలు లేక ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదవీ ప్రమాణస్వీకారం చేసి 45 రోజులవుతున్నా ఇంతవరకూ చిల్లగవ్వ కూడా రాకపోవడంతో ఏదైనా అభివృద్ధి పనులు చేపడుతామన్నా చేతిలో డబ్బులు లేకపోవడంతో గ్రామాల్లో పర్యటించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పరిషత్‌ పాలకవర్గాలకు నుంచి 45 రోజులు దాటింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు అయోమయంలో ఉన్నారు. అయ్యో గిట్లాఝెను.. అని చర్చించుకుంటున్నారు.

నిధులు కేటాయింపు లేక పాలకవర్గాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 16 మండల పరిషత్‌లు ఉన్నాయి. 178 ఎంపీటీసీలు ఉన్నారు. ఇటీవల నూతన పురపాలక చట్టం ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఆదాయాలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధులు సమకూర్చే బాధ్యత ఉందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం కేటాయించే మొత్తానికి తాము సమానంగా ఇవ్వనున్నటుŠల్‌ వెల్లడించారు. పల్లె మునిసిపాలిటీలను పట్టించుకున్న మాధిరిగానే మండల జిల్లా పరిషత్‌లపై దృష్టి సారిస్తే వాటికి పూర్వవైభవం రానుంది.

మూడేళ్లుగా అందని నిధులు
గతంలో కేంద్రం బీఆర్‌జీఎఫ్‌ పేరిట ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళిక సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి అయోగ్‌ చేసిన సిఫార్సులతో రద్దు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండుసార్లు మంజూరవుతాయి. మండలాలకు బట్టి రూ 50 వేల నుంచి రూ 2 లక్షల మేర కేటాయిస్తారు. గత మూడేళ్లుగా జాడలేదు. మండల పరిషత్‌లకు కేటాయించే సీనరేజ్‌ చార్జీలు మొత్తాన్ని సంబంధిత శాఖ నేరుగా పంచాయతీలు కేటాయిస్తున్నాయి. దీంతో మొత్తం కేటాయింపులు లేకుండా పోయాయి.

గతంలోఅరకొర నిధులే..
గతంలో వచ్చింది అరకొరే. గత ఐదేళ్లలో అరకొర నిధులు మంజూరయ్యాయి. మండలం జనాభా తలసరి ఆదాయాన్ని అనుసరించి మండల పరిషత్‌లకు ప్రభుత్వం నుంచి మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు సార్లు నిధులు మంజూరవుతుంటాయి. గత మూడేళ్లుగా మండల పరిషత్‌లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు ఏమైనా కేటాయిస్తారోనని ఎంపీటీసీలు ఎదురుచూస్తున్నారు.

నిలిచిన ఇంటర్‌నెట్‌ సేవలు
జిల్లాలో మండల పరిషత్‌ల్లో డబ్బులు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండలాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కార్యాలయల్లో పేపర్, ప్రింటింగ్‌లు, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దామెర, నడికూడ రెండు కొత్తగా మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. వాటి పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంది. పరిషత్‌లకు నిధులు లేకపోవడంతో అధికారులు తమ దగ్గర డబ్బులు ప్రస్తుతానికి పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాత బిల్లులు పెట్టి తీసకుంటామని అంటున్నారు. భారం కూడా మోసేవరకు మోస్తాం తరువాత మా వల్ల కాదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top