ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి.. వైద్యుల నిర్లక్షంతో మృతి చెందింది. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది.
జడ్చర్ల: ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి.. వైద్యుల నిర్లక్షంతో మృతి చెందింది. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘట న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిధి లోని బాదేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. లింగంపేట గ్రామానికి చెం దిన లావణ్య(25) బాదేపల్లిలో నివాస ముంటోంది.
గర్భిణిగా ఉన్న లావణ్యకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాన్పునకు సంబంధించి శస్త్ర చికిత్స చేసే సమయంలో సదరు గర్భిణితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఓ పెద్దమనిషి రూ.3 లక్షలు బాధిత కుటుంబానికి అందజేసేలా రాజీ కుదిర్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించి లావణ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సీఐ గంగాధర్ తెలిపారు.