తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈరోజు నుంచి 29 వరకు నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సీజీజీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ప్రవేశాల్లో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు.