గ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు | Five of a family injured in fire due to gas leak | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు

Apr 27 2015 4:57 PM | Updated on Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకైన ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకైన ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... లేమూరు గ్రామానికి చెందిన ముచ్చర్ల రవి అనే వ్యక్తి  ఇంట్లోని వంటగదిలో స్టవ్ వెలుగుతున్న సమయంలో గ్యాస్ లీకవడం మొదలైంది.

లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను సరిచేస్తుండగా స్టవ్ మంటలు గ్యాస్‌కు అంటుకోవడంతో ఆ ఇంట్లో ఉన్న ముచ్చర్ల రవి, బాలామణి,  ప్రణీత(3), మంచాల మోహన్, శివ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement