వికారాబాద్ లో అగ్నిప్రమాదం | fire accident in vikarabad due to short circuit | Sakshi
Sakshi News home page

వికారాబాద్ లో అగ్నిప్రమాదం

Jan 13 2016 9:10 AM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎంఆర్‌పీ సర్కిల్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.

వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎంఆర్‌పీ సర్కిల్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బాబ్జీ ఎలక్ట్రికల్స్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. 15 లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించింది. తొలుత పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ లైట్లు కాలిపోవడమేకాక, పెట్రోల్ పంపులు ఆగిపోయాయి. గమనించిన సిబ్బంది మెయిన్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మంటలు పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ షాప్‌కు పాకాయి. రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపుచేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement