బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

జనగామ: జిల్లా కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణంలో ఉన్న బ్యాంకులో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక​సిబ్బందికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

Back to Top