వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయా పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులలో టీఆర్‌ఎస్ మంత్రుల్లా ఆయా పార్టీల నాయకులు, నాటి మంత్రులు ఏమైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఉద్యమంలో ప్రజలతో కలిసి రోడ్లపైనే గడిపామని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు ప్రజలు అసహ్యించుకుని తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.