'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా' | Farooq Hussain files namination | Sakshi
Sakshi News home page

'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'

Jul 1 2014 1:24 PM | Updated on Mar 18 2019 9:02 PM

'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా' - Sakshi

'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసనమండలి కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఫరూక్ హుస్సేన్ అన్నా

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసనమండలి కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఫరూక్ హుస్సేన్ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలంతా పార్టీకి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఫరూక్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మచ్చలేని మైనార్టీ నేత అని, చైర్మన్గా తన విజయానికి కృషి చేయాలని అన్ని పార్టీల ఎమ్మెల్సీల ఇళ్లకు వెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశామన్నారు. అదే అనుబంధంతో కేసీఆర్ను కలిసి కోరనున్నట్లు చెప్పారు. కాగా టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement