పురుగుల మందు డబ్బాతో నిరసన | Farmers Protest On Revenue Office In Khammam | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన

Dec 2 2019 5:44 PM | Updated on Dec 2 2019 6:01 PM

Farmers Protest On Revenue Office In Khammam - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, ఖమ్మం: తాహసీల్దార్‌ కార్యాలయాల్లో నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు ఇవ్వటంలో జాప్యం చేయటం, భూ వివాదాల్లో చేతివాటం ప్రదర్శించటంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలాంటి వ్యతిరేకత రైతుల్లో పెరగటంతో కొంతమంది రైతులు పెట్రోల్‌ బాటిల్‌తో రెవెన్యూ ఆఫీసులకు వచ్చి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. తమ పాసుపుస్తకాల కోసం మరికొంత మంది రైతులు అధికారుల కాళ్లవేళ్ల పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జిల్లాలోని కొణిజర్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతులు పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకొని నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండ.. రైతులు తహసీల్దార్‌ కార్యాలయం గేటుకు తాళం వేశారు. పాసుపుస్తకాల కోసం రైతులు ఆందోళన చెపట్టినట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement