ఆర్మూర్‌లో రైతుల ఆందోళన.. ఉద్రిక్తం

Farmers Protest For Minimum Price At Armor - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరను కల్పించాలని కోరుతూ జాతీయ రహాదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గతవారం రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులను అర్థరాత్రి పోలీసు అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల అరెస్ట్‌లకు నిరసనగా రైతులు మరోసారి జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పంటలకు మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అరెస్టయిన రైతులను విడుదల చెయకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

మరింతమంది రైతులు ధర్నా ప్రాంతానికి తరలివస్తుండడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఆర్మూర్‌ వద్దగల జాతీయ రహదారిపైకి ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్‌ సైకిళ్లపై వచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top