గిట్టుబాటు ధరకోసం ఉద్యమిస్తాం 

Farmers need to support the crops - Sakshi

పసుపు, ఎర్రజొన్నకు గిట్టుబాటు ధరపై కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. టీజేఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని రైతుల డిమాండ్‌ మేరకు పసుపు, ఎర్రజొన్న పంటలకు ధరలు పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16న రైతులు తలపెట్టిన ఆందోళనకు తాము మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు కారణంగా పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గం లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేస్తామన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top