రైతన్నను వెంటాడుతున్న అప్పులు | farmers dead due to debts | Sakshi
Sakshi News home page

రైతన్నను వెంటాడుతున్న అప్పులు

Dec 2 2014 10:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

రైతన్నను వెంటాడుతున్న అప్పులు - Sakshi

రైతన్నను వెంటాడుతున్న అప్పులు

భూగర్భజలాలు ఎండి పంటలు దక్కక పోవడంతో చేసిన మయ అప్పులు ఎలా తీర్చాలో కలత చెంది ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పగా.

నంగునూరు/తూప్రాన్ : భూగర్భజలాలు ఎండి పంటలు దక్కక పోవడంతో చేసిన మయ అప్పులు ఎలా తీర్చాలో కలత చెంది ఓ రైతు  పురుగు మందు తాగి ఆత్మహ త్యకు పాల్పగా.. మరో రైతు గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలోని నంగునూరు, తూప్రాన్ మండలాల్లో మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. నం గునూరు మండలంలోని సిద్ధన్నపేటకు చెందిన బోడ సంపత్‌రెడ్డి (32) తనకున్న మూడెకరాల్లో వ్య వసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న పొలం పక్కనే వాగు ఉండడంతో  రైతు మూ డు బోర్లు వేయించాడు.

మూడింటిలో నీరు పడడంతో మొక్కజొన్నతో పాటు కూరగాయలను సాగు చేశాడు. ప్రతిరోజూ పండే కూరగాయలను సైకిల్‌పై తిరుగుతూ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో విక్రయించేవా డు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయాయి. కోత కొచ్చిన పంటలకు తోడు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఇటీవల కా లంలో పంట పెట్టుబడులు, బోర్ల వేసేందుకు, కుటుంబ పోషణ తదితరాల కోసం సుమారు రూ. 3 లక్షల వరకు అప్పుచేశాడు.  అయితే వీటి ఎలా తీ ర్చాలంటూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం ఉద యం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన సంపత్‌రెడ్డి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నా డు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు పొ లాల రైతులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి చి కిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించాడు. ఈ క్ర మం లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవా రం  సంపత్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య మం గవ్వ, కుమారుడు రమణారెడ్డి, కుమార్తె అశ్వితలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.  మృతుడి భార్య మంగవ్వ ఫిర్యాదు మేరకు రాజ్‌గోపాల్‌పేట ఎస్‌ఐ గోపాల్‌రావు కేసు నమోదు చేసుకు ని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఆగిన రైతు గుండె

తూప్రాన్ : ఎండిన పంటలను చూసిన ఓ రైతన్న గుండె ఆగింది. ఈ సంఘటన మండలంలోని ఘనపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుల చంద్రయ్య (58)కు ఎకర పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. తన కున్న పొలంలో మూడు బోర్లు వేశాడు. కానీ వాటిల్లో నీరు పడలేదు. దీంతో ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంట కూడా చేతికందక ఎండిపోయింది. ఈ క్రమంలో పంటల పెట్టుబడు లు, కుమార్తె వివాహం, బోర్లు వేసేందుకు సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఏయేటికి ఆ యేడు పంటలు వస్తాయి.. అప్పులు తీరుద్దామనుకోవడంమే తప్ప తీర్చలేకపోతున్నాడు.

ఈ క్రమం లో రుణదాతలు కూడా అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో అంతుపట్టక ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద తరచూ ప్రస్తావిస్తూ కలత చెందే వాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుండెలో నొప్పి వస్తోందని కుటుం బీకులకు తెలిపాడు. వారు చంద్రయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.  త మకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement