రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ..
మొయినాబాద్: రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కేసరి నారాయణరెడ్డి(34) తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో.. అప్పు చేసి పత్తిపంట సాగు చేశాడు. పంట పూర్తిగా ఎండిపోవడంతో.. అప్పులు తీర్చే దారికానరాక ఇంట్లోని దూళానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.