విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 15 2015 7:50 PM | Updated on Oct 1 2018 2:44 PM

నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన డి.నర్సయ్య(60) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు.

కొలనుపాక (ఆలేరు) : నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన డి.నర్సయ్య(60) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సయ్య వ్యవసాయ బావి వద్ద పనులు ముగించుకుని అక్కడే ఉన్న రేకుల షెడ్డు కింద సేద తీరి తిరిగి బయటకు వస్తున్న క్రమంలో అతని చేతులు రేకులకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రేకుల షేడ్డు మీదుగా ఉన్న సర్వీస్ వైర్లు రేకులకు తాకడంతో.. విద్యుదాఘాతానికి గురయ్యాడని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement