కౌలు రైతు ప్రాణం తీసిన కరువు | farmer committed suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ప్రాణం తీసిన కరువు

Mar 13 2015 5:31 PM | Updated on Nov 6 2018 7:56 PM

కౌలు చెల్లింపుతోపాటు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేనేమోననే బెంగతో ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు.

రామన్నపేట : కౌలు చెల్లింపుతోపాటు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేనేమోననే బెంగతో ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిదానపల్లికి చెందిన కడారి మల్లేశం(30) గ్రామశివారులోఉన్న ఓ సీడ్స్ కంపెనీకి చెందిన 24 ఎకరాల భూమిని ఏడాదికి రూ.1.20 లక్షల వంతున చెల్లించే ఒప్పందానికి కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో వరి, పత్తి, మినుము సాగు చేశాడు. ఇందుకోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని, పెట్టుబడులు పెట్టాడు.

 

వర్షాభావం కారణంగా బోర్లు ఎండిపోవటంతో పంటలు దెబ్బతిన్నాయి. మనస్థాపానికి గురైన మల్లేశం పురుగులమందు తాగాడు. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మల్లేశానికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement