అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits sucide with debt | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jan 31 2015 12:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఓ రైతు ఆత్యహత్యకు పాల్పడ్డాడు.

రామన్నపేట: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఓ రైతు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా రామన్నపేట మండలం యెన్నారం గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(36) అనే రైతు ఈ ఏడాది 3 ఎకరాల్లో వరి పంట సాగుచేశాడు. పొలంలో మడులు కట్టడం, ఇతరత్రా పనుల కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు.

కానీ నీళ్లు లేక సాగుచేసిన పంట ఎండిపోయింది. గతేడాది సాగు కలిసి రాక పోవడం, ఇప్పుడు పంట ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో పంట కోసం తెచ్చిన మందు  తాగి శ్రీరామలు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement