పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం

Fake Voters Casts multiple votes in Old City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. తెలంగాణలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చార్మినార్‌, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గర సైక్లింగ్‌ పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఎన్నిక కమిషన్‌ విచారణకు ఆదేశించింది. స్పిరిట్‌తో సిరాచుక్కను చెరిపేందుకు ప్రత్యేక వ్యక్తులను కొన్ని పార్టీలు నియమించి, మహిళలతో మళ్లీ మళ్లీ ఓట్లు వేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు సైక్లింగ్‌ ఓటింగ్‌ జోరుగా సాగింది. ఒక్కో వ్యక్తితో వందల సంఖ్యలో ఓట్లు వేయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top