ఫేస్‌బుక్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ ఇలా.. | Facebook By the Money Transfer .. | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ ఇలా..

Oct 26 2014 3:44 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ ఇలా.. - Sakshi

ఫేస్‌బుక్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ ఇలా..

ఆప్తులకు, స్నేహితులకు, ఇతర వ్యాపార లావాదేవీలు జరపడానికి బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా?..

ఆప్తులకు, స్నేహితులకు, ఇతర వ్యాపార లావాదేవీలు జరపడానికి బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా?.. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సమయం మించిపోయిందా?.. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్రాంచి కోడ్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర విషయాలపై మీకు అవగాహన లేదా? అయితే ఇలాంటి సందర్భాల్లో నగదును సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఫేస్‌బుక్ దోహద పడుతుంది. ఇందుకు కొటక్ మహీంద్రా వారు అవకాశం కల్పిస్తున్నారు.     - గాజులరామారం
 

రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా....
ఇందుకు మీరు  https://www.kaypay.com
వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి.
ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్‌బుక్ ఆప్షన్ వస్తుంది.
మీరు ఫేస్‌బుక్ అకౌంట్‌తో లాగిన్ కావాలి.
మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి
కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ అకౌంట్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబరుతోపాటు ఎంఎంఐడీ నెంబరు ఇవ్వాలి.  
ఇందుకు మీరు ఐడీని ఎస్‌ఎంఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది.
 
 నగదు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...
మీ రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉన్న మిత్రులకు మీరు నగదు
బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది.
మీరు నగదు పంపాల్సిన వ్యక్తిని ఎంచుకుని
అతని అకౌంట్ నంబరును ఎంటర్‌చేయాలి.
మీరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా ఇక్కడ పొందుపరచవచ్చు.
ఇక మీరు ఒన్ టైమ్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
ఇందుకు మీరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోగానే ఓటీపీ కోసం
ఎస్‌ఎంఎస్ చేసే విధానాన్ని చూపిస్తుంది.
దాన్ని అనుసరించి మీరు ఓటీపీ రూపొందించుకోవాలి.
మీ మొబైల్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేస్తే నగదు బదిలీ అవుతుంది.
మీరు నగదు పంపే వ్యక్తి కేపేలో రిజిస్టర్ లేకపోతే అతని ఫేస్‌బుక్
అకౌంట్‌కు సమాచారం వెళ్తుంది.
సంబంధిత వ్యక్తి 48 గంటల్లో kaypayలో రిజిస్టర్ అవ్వాలి.
ఒక వేళ కాని పక్షంలో తిరిగి మీ డబ్బులు మీ అకౌంట్‌కు చేరుతాయి.

సూచనలు...
ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం 28 బ్యాంకులకు మాత్రమే ఉంది.
ఇది 24 గంటలూ పని చేస్తోంది.
నగదు పంపేవారు రోజుకు రూ. 2,500, నెలకు రూ.25 వేల వరకు మాత్రమే నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
ఈ విధానం ద్వారా నెల మొత్తంలో ఎప్పుడైనా రూ.25 వేలు అందుకోవచ్చు.
24 గంటల్లో మీ నగదు బదిలీ పూర్తి అవుతుంది.
మీ పేరు కాని, మీరు బదిలీ చేయాలనుకునే వారి పేరు కానీ, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ కోడ్ కాని అందించాల్సిన అవసరం లేదు.
టువే సెక్యూర్డ్ పాస్‌వర్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సేఫ్.
అన్ని లావాదేవీలు కొటక్ మహీంద్రా సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయి.     
 
ఉదాహరణకు..
మీది ఎస్‌బీఐ అకౌంట్ అయితే MMID SBI అని టైప్ చేసి 9223440000కు మెసేజ్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో మీరు ఏ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నారో దాని నుంచే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
mmid పొందాలంటే మీ ఫోన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్‌కు    లింక్ అప్ అయి ఉండాలి.  
ఎంఎంఐడీ కోసం ప్రతి బ్యాంక్‌కు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఉంటుంది. సంబంధిత నంబర్ బ్యాంక్ పేరు ఎంచుకోగానే మీకు కనిపిస్తుంది.
ఇప్పుడు మీ మొబైల్‌కు ఏడు అంకెలు గల mmid (mobile money identifier)-వస్తుంది.
దీన్ని ఎంటర్ చేశాక తరువాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్‌ను
సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి.
ఇక మీ అకౌంట్ రిజిష్ట్రర్ అయిపోయినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement