రేపే నీట్‌.. సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

రేపే నీట్‌.. సర్వం సిద్ధం

Published Sat, May 4 2019 7:32 PM

Exam Centers Reddy For NEET In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు తెలంగాణలో  పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండు గంటల ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని.. 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి నిరాకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు భారతీయ విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా ఈఏడాది 80వేలమంది నీట్‌ పరీక్షకు హాజరవుతున్నారని నిర్వహకులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, బూట్లు, ఎత్తుమడిమల చెప్పులు, వాటర్‌ బాటిల్స్‌, ఫోన్స్‌, ఎలక్ట్రికల్ పరికరాలు, విద్యార్థినులు గాజులు, గొలుసులు, ఆభరాణాలు హ్యాండ్‌ బ్యాగ్స్ తీసుకురావద్దని తెలిపారు. పరీక్షకు హాల్‌ టికెట్ తప్పనిసరి. అప్లికేషన్‌లో పొందుపరిచిన ఫోటో కాపీని తీసుకుని వెళ్లాలని, దానితో పాటు  ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరని విద్యా మండలి అధికారులు సూచించారు. 


 

Advertisement
Advertisement