
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపు రానికి చెందిన తెలంగాణ మహాజన సమాజం రాష్ట్ర కన్వీనర్, మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్‌ను గుజరాత్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ కోర్టులో హాజరై బయటకు వస్తుండగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనివాస్‌పై గుజరాత్‌లో ఓ కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓ కేసులో నెల రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్ 8 రోజుల క్రితమే బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈయన గతంలో ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు. మూడేళ్ల క్రితం శ్రీనివాస్‌ను ఖమ్మం పోలీసులు అరెస్టు చేయగా, ఏడాది పాటు జైలులో ఉండి.. బెయిల్‌పై వచ్చారు.