రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు

EVMs Transported By Auto In Jagtial At Night Time - Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్‌ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్‌తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top