గ్రామాలపై దృష్టి పెట్టాలి

Etela Rajender Launches State Dental Conference In Hyderabad - Sakshi

దంత వైద్యులకు మంత్రి ఈటల సూచన

6వ ఎడిషన్‌ తెలంగాణ స్టేట్‌ డెంటల్‌ కాన్ఫరెన్స్‌–2019 ప్రారంభం

మాదాపూర్‌: దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో 6వ ఎడిషన్‌ తెలంగాణ స్టేట్‌ డెంటల్‌ కాన్ఫరెన్స్‌–2019 శనివారం ఆయ న ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్‌లో దంత వైద్యానికి సం బంధించిన పలు రకాల పనిముట్లు, యంత్ర పరికరాలు, శస్త్ర చికిత్స పద్ధతులకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తెలంగాణ.. రాష్ట్రం వచ్చిన తరువాత దేశంలో మూడవ స్థానానికి ఎదిగిందన్నారు.

దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. నూతన దంత వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ఇప్పుడు అందుబాటులో ఉన్న దంత వైద్యులనే సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. దంత వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు ఎస్‌.జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top