ప్రతిభకు పట్టం కడదాం 

Entry Invitation To The Sakshi Excellence Awards 6th Edition

సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 6వ ఎడిషన్‌కు ఎంట్రీల ఆహ్వానం

మార్చి 31 సాయంత్రం 6 గంటల వరకు గడువు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం... రంగం ఏదైనా ప్రతిభే కొలమానం... ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 6వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌ అవార్డుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను అందజేయవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపించవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు.

నైపుణ్యాలను ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తుల్ని గుర్తించి వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్‌ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ ఫామ్‌లో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు www. sakshiexcellence awards. com వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (వర్కింగ్‌ డేస్‌లో) 040–23322330 ఫోన్‌ నంబర్‌ లేదా sakshiexcellence awards2019 @sakshi. com ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top