ఎంసెట్‌ కేసు దర్యాప్తు వేగవంతం

కమిలేశ్‌కు లింకున్న మరో 9 మంది కోసం వేట

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. లీకేజీలో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న కార్పొరేట్‌ కాలేజీల లింకును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. లీకేజీలో కీలకంగా ఉండి దర్యాప్తులో మృతి చెందిన కమిలేశ్‌కుమార్‌ లింకును ఛేదించనున్నారు. కమిలేశ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తూ.. విద్యార్థులను క్యాంపులకు తరలించిన మరో 9మందిని సీఐడీ గుర్తించింది.

వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలను పట్నా, పుణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెండు రోజుల్లో నిందితుల ఆచూకీ పూర్తిస్థాయిలో గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించి బ్రోకర్లు, కీలక నిందితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో చార్జిషీట్‌ రూపొందించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top