క్యాబ్‌.. కావాలా?

Elite Cab Free Services in Hyderabad For Emergency - Sakshi

ఉచిత సర్వీస్‌కు ఎలైట్‌ క్యాబ్స్‌ పచ్చజెండా

నగర కమిషనరేట్‌ పరిధిలో 5 వాహనాలు

ప్రారంభించిన సిటీ కొత్వాల్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిట్యీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బందులుపడుతున్న వారి కోసం ఎలైట్‌ క్యాబ్స్‌ ఉచిత సేవలు అందిస్తోంది. మహేంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సర్వీస్‌ను సిటీ కొత్వాల్‌ అంజనీకుమార్‌ మంగళవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. నగర కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే ఈ క్యాబ్‌ సర్వీస్‌ను పొందాలకునేవారు 84339 58158కు ఫోన్‌ చేయాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5 క్యాబ్‌లు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 2 క్యాబ్‌లు ఉచిత సర్వీసును అందించనున్నాయి. 

ఎవరు వినియోగించుకోవచ్చు?
సీనియర్‌ సిటిజన్స్, ఒంటరిగా ప్రయాణించే పసిబిడ్డల తల్లులు, ఫిజికల్లీ చాలెంజ్డ్‌ వ్యక్తులు.. నిత్యావసర వస్తువులు, ఔషధాలు తెచ్చుకోవడానికి, బ్యాంకులు,  పోస్టాఫీసులకు వెళ్లి వచ్చేందుకు..   
అవసరార్థులకు నిత్యావసాలు, ఆహారం, ఔషధాలు పంపిణీ చేసే కార్యకర్తల రవాణా కోసం..
హృద్రోగులు, చిన్నారుల టీకాలు వేయించడానికి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లి రావడానికి..
ఆరోగ్య శాఖ సంబంధిత రంగాలకు చెందిన ఉద్యోగులు తమ విధులకు వెళ్లడానికి, రావడానికి..

వీరికి సేవలు అందించరు
కోవిడ్‌ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నవారికి..  
రక్తస్రావంతో కూడిన గాయాలున్నవారికి, హార్ట్‌ ఎటాక్, కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి  బాధితులు, నెలలు నిండిన గర్భిణులకు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top